Home / Events / ‘సూర్యకాంతం’ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే…..

‘సూర్యకాంతం’ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే…..

వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన చిత్రం ‘సూర్యకాంతం’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌ జెఆర్‌సిలో జరిగిన విషయం తెలిసిందే. యూత్ హీరో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై.. సూర్యకాంతం ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తారని అంతా ఊహించారు. అయితే ట్రైలర్‌ను మరో క్రేజీ స్టార్ చేతుల మీదుగా విడుదల చేసేందుకుగానూ, ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేయలేదనే విషయం తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది.

‘సూర్యకాంతం’ చిత్ర ట్రైలర్‌ను 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు దగ్గుబాటి రానా చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లుగానూ చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ, ట్రైలర్ విడుదలకు రానా దగ్గుబాటి.. మొత్తానికి ‘సూర్యకాంతం’ ప్రమోషన్ మాములుగా లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి.

 

Spread the love