Home / Movie Gossips / విశ్వామిత్ర ట్రైలర్‌ విడుదల

విశ్వామిత్ర ట్రైలర్‌ విడుదల

సినిమా ట్రైలర్‌ విడుదల :

ప్రముఖ హీరోయిన్ నందిత, నటుడు ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘విశ్వామిత్ర’. ఈ సినిమాకు రాజ్‌ కిరణ్‌ దర్శకత్వం వహించారు. సోమవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలో ప్రసన్న పోలీసు అధికారి పాత్రలో నటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నందితకు ఓ వ్యక్తి కనిపించకుండా సాయం చేస్తుంటాడు. కానీ అతను ప్రాణాలతో ఉండడు. ఇదే విషయం గురించి నందిత పోలీసు అధికారి ప్రసన్నకు చెబుతుంది. అతను నమ్మడు. ‘చనిపోయివాడు వచ్చి నీ సమస్యలు తీర్చాడంటే నమ్మడానికి నేను పిల్లోడిని కాను పోలీసోడిని’ అని ప్రసన్న ఆమె మాటలను కొట్టిపారేస్తాడు. ‘ఈ విశ్వంలో మానవ మేథస్సుకు అందని విషయాలు చాలా ఉన్నాయి’ అంటూ ఆసక్తికరమైన అంశాలతో సినిమాను తెరకెక్కించారు.  ఈ సినిమాలో సత్యం రాజేశ్‌, అశుతోశ్ రాణా‌ కీలక పాత్రలు పోషించారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ సినిమాకి సంగీతం అందించగా, మాధవి అద్దంకి, రజనీకాంత్‌, రాజాకిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 21న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Spread the love