Home / Movie Reviews / ‘వినయ విధేయ రామ’ ట్విటర్ రివ్యూ

‘వినయ విధేయ రామ’ ట్విటర్ రివ్యూ

నేడుఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు:

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులు మిశ్రమ స్పందనను తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడని… కియారా తన అందం, డ్యాన్సులతో మెప్పించిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే ఈ సినిమాలో అజర్‌బైజాన్ సహా మరికొన్ని సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతినాయకుడి పాత్రలో వివేక్ ఒబెరాయ్ మెస్మరైజ్ చేశారని టాక్.. కానీ హార్స్ రైడింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.

దేవిశ్రీ సంగీతం అందించారంటే ఆ చిత్రం ఆడియో బ్లాక్ బస్టర్ అనే భావన ప్రేక్షకుడిలో ఉంది. కానీ ఈ చిత్రానికి సంగీతమే దెబ్బేసిందని ప్రేక్షకుల టాక్. ‘రంగస్థలం’ సినిమాలో కథను బట్టి చెర్రీ పెద్దగా స్టెప్పులకు ప్రాధాన్యమివ్వలేదు. కానీ ఈ చిత్రంలో డ్యాన్సుల పరంగా దుమ్మురేపాడని నెటిజన్లు చెబుతున్నారు. ఫస్ట్ మొత్తం కాస్త ఆకట్టుకున్నప్పటికీ సెకండాఫ్ మాత్రం రొటీన్ కథతో బోయపాటి ప్రేక్షకులను కాస్త నిరుత్సాహానికి గురి చేశారని టాక్. ఇంటర్వెల్ బ్యాంగ్, బీహార్ ఎపిసోడ్స్ మాత్రం ఆకట్టుకునేలా బోయపాటి చిత్రీకరించారనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. ఎమోషన్, యాక్షన్‌ అంశాలపై దృష్టి పెట్టే బోయపాటి.. ఈ చిత్రం ద్వారా మాత్రం ప్రేక్షకులను కాస్త నిరుత్సాహానికి గురిచేశారనే అభిప్రాయం మాత్రం దాదాపు నెటిజన్లంతా చెబుతున్న మాట.

Spread the love