Home / Movie News / వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: ఎందుకు!

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: ఎందుకు!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ!

వివాదాలను ఏమాత్రం పట్టించుకోకుండా దూసుకెళ్ళటం ఆయన స్టైల్. ఎవరేమన్నా.. ఎలా అనుకున్నా తాను చేయాల్సిన పని చేసేస్తుంటారాయన. అదే కోవలో ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరుతో ఎన్టీఆర్ జీవిత కథాంశాన్ని తెరకెక్కిస్తూ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు వర్మ! బాలకృష్ణ రూపొందించే ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపించని ఎన్నో సన్నివేశాలు తన బయోపిక్‌లో చూపిస్తానని చెప్పిన వర్మ.. ఇటీవల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని ”వెన్నుపోటు” అనే మొదటిపాట విడుదల చేసి సంచలనం సృష్టించాడు.. ఇక ఇప్పుడు ‘ఎందుకు’ అనే రెండోపాట విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఈ రోజు (జనవరి 8) సాయంత్రం 5 గంటలకు ‘ఎందుకు’ పాట విడుదల చేయబోతున్నామని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు వర్మ. దీంతో.. మొదటిపాట సృష్టించిన ప్రకంపనలు మరవక ముందే మరోపాట విడుదల చేస్తున్న వర్మ ఈ సారి మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడో! అంటున్నారు జనం. మరోవైపు బాలకృష్ణ రూపొందించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదలకు ఒకరోజు ముందు.. ఇలా వర్మ సాంగ్ రానుండటం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

Spread the love