Home / Movie News / నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి: నాగబాబు వార్నింగ్

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి: నాగబాబు వార్నింగ్

ఎంత అహంకారం మీకు? మాకు చేతకాదా అనడం?

కొద్దిరోజులుగా నాగబాబు.. నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ.. కొన్ని కామెంట్స్ చేసి వాటికి వివరణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 5 కామెంట్లకు వివరణ ఇచ్చిన నాగబాబు.. ఇప్పుడు ఆరో కామెంట్ మరియు వివరణ కూడా ఇచ్చారు.

అయితే ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు కామెంట్ చేయడం ఏమిటని.. ఆయన విడుదల చేస్తున్న వీడియోలపై వస్తున్న కామెంట్స్‌కు కూడా ఆయన వివరణ ఇచ్చారు.

అలాగే 2012లో నందమూరి బాలకృష్ణ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ‘మా నాన్న కాలిగోటికి కూడా చిరంజీవి సరిపోడు’ అని అన్నారని దీనిపై నాగబాబు ఫైర్ అవడమే కాకుండా.. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

”2012 జనవరిలో నేను ఊరెళుతున్నాను. ఆ సమయంలో నాకు మెసేజ్‌లు తప్ప… ఫోన్ అందని పరిస్థితి. అప్పుడు బాలకృష్ణ గారు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది చాలా డామేజింగ్ స్టేట్‌మెంట్ కానీ.. ఎవరూ రియాక్ట్ అవలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్‌లో కూడా లభ్యం కాలేదు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఒకవైపు బాలకృష్ణ గారు అన్నమాట.. మరోవైపు చిరంజీవిగారు ఇచ్చిన సమాధానం.. రెండూ ఉన్నాయి. కావాలంటే వెతుక్కోండి.

ఇప్పటికి కూడా దానికి చిరంజీవి గారు ఆన్సర్ ఇచ్చిన క్లిప్పింగ్ దొరకుతుంది. పత్రికా విలేఖరులేదో అడిగారు. అప్పుడు బాలకృష్ణ.. ‘ఎన్టీఆర్ కాలి గోటికి కూడా చిరంజీవి పనిచేయడు’ అని ఒక మాట అన్నారు. అది విన్న మాకు చాలా కోపం, ఆవేదన కలిగాయి. నేను రియాక్ట్ అవుదామనుకునే లోపు మా అన్నయ్యగారు ఏం చేశారంటే.. ‘బాలకృష్ణ చిన్న పిల్లవాడు. అతనికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు’ అంటూ పెద్దరికంగా సమాధానం ఇచ్చి ఊరుకున్నాడు.

ఆయన పెద్దరికం వల్ల మేమేమీ మాట్లాడలేక ఆవేశాన్ని చంపుకుని కూర్చున్నాం. లేదంటే నేను ఆ రోజే రియాక్ట్ అయ్యేవాడిని. ఆయన అన్నమాట ఎంత తప్పు? మీ నాన్నగారు మీకు గొప్ప. ఏ కొడుకుకైనా తండ్రి గొప్పే. రిక్షా తొక్కే వ్యక్తికైనా సరే.. అతని కొడుక్కి రిక్షా తొక్కే తండ్రి గొప్పే. మీ నాన్నగారి గొప్పతనాన్ని కీర్తించుకోవడంలో తప్పు లేదు. కానీ మా నాన్న కాలి గోటికి చిరంజీవి సరిపోడు అన్నారు కదా.. అదే మాట నేను తిరిగి..

చిరంజీవి కాలి గోటికి బాలకృష్ణ సరిపోడు అంటే మీకెలా ఉంటుంది? మీ ఫ్యాన్స్‌కి ఎలా ఉంటుంది? మీ ఇంట్లో వాళ్లకి… మీ పార్టీ వాళ్లకెలా ఉంటుంది? అంత ఈజీ అయిపోయారా చిరంజీవి మీకు? ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోడనడం ఏంటి? ఎంత అహంకారం మీకు? మాకు చేతకాదా అనడం? నెక్ట్స్ మినిటే అనగలం కానీ ఈ రోజు వరకూ అనం మేము. మా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అలా ఉంది. అలాగే పెరిగాం.

సర్ మర్యాదగా చెబుతున్నా. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. వంద విమర్శలు చేయండి. మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి లూజ్ టంగ్ మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇక్కడ ఎవరికీ ఎవరూ భయపడే వ్యక్తులు లేరు. కేవలం సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం.

కాబట్టి ఇలాంటి లూజ్ టంగ్ మాటలు ఆపేయండి. ఆపేస్తారని ఆశిస్తున్నాం. అంతే తప్ప మీతో ఎలాంటి గొడవలూ లేవు. మా అన్నయ్యని.. మా తమ్మున్ని అంటే మాత్రం తప్పకుండా రియాక్ట్ అవుతాం. అది మీరు అవనివ్వండి.. వేరే ఎవరైనా అవనివ్వండి” అని నాగబాబు చెప్పుకొచ్చారు.

Spread the love