Home / Celebrity news / సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌ ప్రారంభించింది. ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ముంబైలో భారీ సెట్‌ వేశారు. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ రివీల్‌ చేశారు. ఈ చిత్రానికి దర్బార్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌లోనే రజనీని పవర్‌ఫుల్‌గా చూపించారు. రజని వెనుక తుపాకులు, బెల్ట్‌, బేడీలు కనిపిస్తున్నాయి. రెండు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని మురుగదాస్‌ సంకల్పించారు. కథానాయికగా నయనతార నటిస్తుండగా, అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ముంబై నేపథ్యంలో సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌లో తెలిసిపోతుంది.

Spread the love