Home / Movie Gossips / చందమామ ఎవరికీ ఐ లవ్యూ చెప్పింది?

చందమామ ఎవరికీ ఐ లవ్యూ చెప్పింది?

కొందరు కాజల్ లవ్ లో పడిందేమో అని కామెంట్ చేస్తుంటే..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్  ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి పదిహేనేళ్ళయినా ఇంకా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ లో అవకాశం సాధించి తనకు ఇంకా డిమాండ్ ఉందని ప్రూవ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ భామ రీసెంట్ సోషల్ మీడియా పోస్టులు హాట్ టాపిక్ అయ్యాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీలలో కాజల్ అగర్వాల్ పేరు కూడా ఉంటుంది.  తనకు ట్విట్టర్ లో 2.3 మిలియన్ ఫాలోయర్లు.. ఇన్స్టాగ్రామ్ లో  9 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఆమె తరచుగా సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. అయితే ఈమధ్య కాజల్ ఇన్స్టాగ్రామ్ లో చేసిన రెండు మూడు పోస్టులు నెటిజనులకు పిచ్చెక్కించాయి.  ఒక పోస్ట్ లో గోధుమ రంగులో ఉండే బ్లాంక్ ఫోటో ను పోస్ట్ చేసింది. మరో ఫోటోలో అలాంటిదే కాకపోతే “క్విక్ రిమైండర్.. ఐ లవ్యూ” అంటూ టెక్స్ట్ మెసేజ్ ఉంది. మరో పోస్ట్ మళ్ళీ గోధుమ రంగు తో ఉన్న బ్లాంక్ ఇమేజ్.

దీంతో ఈ పోస్టుల గోల అర్థం కాక నెటిజనులు తమ బుర్రలను గోక్కున్నారు.  కొందరు కాజల్ లవ్ లో పడిందేమో అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఫ్యాన్స్ ను లవ్ చేస్తోందని అర్థాలు తీశారు.  అయినా లవ్ లో పడితే ఆ సుందరుడి ఫోటోను చూపిస్తే ఓ పనైపోతుంది కదా.  సవాలక్ష టెన్షన్లతో సతమతమయ్యే నెటిజనులకు ఇది మరో టెన్షన్.  గతంలో పెళ్ళి  ప్రస్తావన తీసుకొస్తే నేను ఇప్పట్లో పెళ్ళి చేసుకోనని చెప్పింది.  మరో సందర్భంలో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని చేసుకోనని చెప్పింది.  పెళ్ళి వద్దు సరే.. ఈ ప్రేమ.. ఆ ‘ఐ లవ్ యూ’ ఎవరికి?

Spread the love