Home / Movie Gossips / మారుతి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ

మారుతి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ

ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు:

తేజ్ ఐ లవ్ యు’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని యంగ్ హీరో సాయిధరమ్‌తేజ్ చేస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ చిత్రంపై తేజు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ యంగ్ హీరో తన నెక్స్ మూవీని మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. జిఎ2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ‘చిత్రలహరి’ సినిమా విడుదలైన వెంటనే మారుతి దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్ ఈ చిత్రాన్ని చేస్తాడు.

Spread the love