Home / Movie News / ఆర్ఆర్ఆర్ ముందున్న సవాల్ అదే

ఆర్ఆర్ఆర్ ముందున్న సవాల్ అదే

హాట్ టాపిక్ గా మారిన రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ :

విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారిన రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. బాహుబలి తర్వాత టాలీవుడ్ మార్కెట్ కు రెక్కలు వచ్చిన మాట వాస్తవం. తెలుగువాడి సత్తా జాతీయ స్థాయిలో బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల వసూళ్లు సాధ్యమయ్యాయి. ఆ లెక్కన ఆర్ఆర్ఆర్ మీద అంచనాలు అంతకు మించి అనేలా ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాని దీనికి మరో కోణం ఉంది.

బాహుబలి గ్రాఫిక్స్ తో రూపొందిన ఫాంటసీ మూవీ. అలాంటివి అరుదుగా వస్తాయి కాబట్టి రాజమౌళి ఎమోషనల్ మాయాజాలం దానికి తోడయ్యి విదేశాల్లో సైతం ఆదరగోట్టింది. ఫాంటసీని మెప్పించేలా చూపగలిగితే దాన్ని మించిన కల్పతరువు ఉండదు. కాని ఆర్ఆర్ఆర్ జానర్ అది కాదు. ఇద్దరు స్టార్ హీరోలతో స్వతంత్రం రాక మునుపు బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ఇది రెగ్యులర్ కమర్షియల్ డ్రామా కిందకే వస్తుంది. మరి బాహుబలి టైంకి జక్కన్న టీం తీసుకొచ్చిన హైప్ ఆర్ఆర్ఆర్ కు ఎంతవరకు తీసుకురాగలదు అనేదే అసలైన సవాల్. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లకు డబ్బింగుల పుణ్యమా అని నార్త్ లో బాగానే గుర్తింపు ఉంది కానీ మార్కెట్ ని శాశించే స్థాయిలో మాత్రం కాదు.

అక్కడ పని చేయాల్సింది రాజమౌళి బ్రాండే. బాహుబలి ఇమేజ్ ఇక్కడ బాగా హెల్ప్ అవుతుంది. పైగా రిస్క్ లేకుండా ఆటోమేటిక్ గా హైప్ వచ్చేలా చేయడంలో రాజమౌళి ఎక్స్ పర్ట్. అందులో సందేహం అక్కర్లేదు. పబ్లిసిటీ విషయంలో ఏమరుపాటుగా ఉంటే ఫలితం  ఎలా ఉంటుందో 2.0 కు అనుభవమవుతోంది. కోట్ల రూపాయల వసూళ్లు వస్తున్నా తమిళనాడు లో సర్కార్ లాంటి మాములు కమర్షియల్ సినిమా కంటే తక్కువ రాబట్టే పరిస్థితి ఉందంటే దానికి కారణం మార్కెటింగ్ లోపమే. మరి రాజమౌళి ఈ సూత్రాన్ని వంటబట్టించుకునే రంగంలో దూకుతాడు కాబట్టే ఆందోళన అక్కర్లేదని అంటున్నారు పరిశీలకులు

Spread the love

Leave a Reply