Home / Celebrity news / సమంత తో ప్రభాస్ జోడి..?

సమంత తో ప్రభాస్ జోడి..?

బాహుబలి సినిమా విజయం తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. యాక్షన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కబోతున్న ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చాలా యాక్షన్ పార్ట్ పూర్తయిన నేపథ్యంలో షూటింగ్ తుది దశకు చేరుకున్న క్రమంలో ప్రభాస్ తన తర్వాత సినిమా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారు.

ఇది కాకుండా నిర్మాత దిల్ రాజుతో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిలింనగర్ టాక్.దిల్‌రాజు-ప్రభాస్ కాంబోలో రానున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇప్పటికే దిల్‌రాజు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి ప్రకటన మాత్రం బయటికి రాలేదు.

ఇప్పటివరకు సిల్వర్‌స్క్రీన్‌పై ప్రభాస్, సమంత కలిసి నటించలేదు. మరి దిల్‌రాజు ప్రాజెక్టు ఓకే అయితే..ఈ ఆసక్తికర కాంబినేషన్‌ త్వరలో వెండితెరపై సందడి చేయనుందన్నమాట. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ‘బాహుబలి’ విజయంతో ప్రపంచ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ‘సాహో’ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

Spread the love