Home / Movie Gossips / చైతూ సమంత లవర్స్ డే కానుక..

చైతూ సమంత లవర్స్ డే కానుక..

టాలీవుడ్ మోస్ట్ పాప్యులర్ కపుల్ అక్కినేని నాగ చైతన్య- సమంత:

టాలీవుడ్ మోస్ట్ పాప్యులర్ కపుల్ అక్కినేని నాగ చైతన్య- సమంత కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా దివ్యాన్షా కౌషిక్ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను షైన్ స్ర్కీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్‌తో సినిమా రూపొందుతోంది. పెళ్లి తర్వాత మొదటిసారి చైతూ, సమంత ఒకే స్ర్కీన్‌పై దర్శనమీయనుండటంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది.

కాగా లవర్స్ డే కానుకగా చిత్ర టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రయూనిట్. ఈ మేరకు తాజా ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 9గంటల 9 నిమిషాలకు చిత్ర టీజర్ విడుదల చేయనున్నామని ప్రకటించారు. చిత్రానికి గోపిసుందర్ బాణీలు కడుతున్నారు. ఏప్రిల్ 5వ తేదీని చిత్ర విడుదల తేదీగా ఫిక్స్ చేశారు.

Spread the love