Home / Movie Gossips / సచిన్‌… సోంబేరి…

సచిన్‌… సోంబేరి…

నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రమిది:

”నీకో సంవత్సరం టైమ్‌ ఇస్తున్నాను. ఈలోగా సచినే అవుతావో… సోంబేరి అవుతావో… నీ ఇష్టం” అని ‘మజిలీ’ టీజర్‌లో వినిపించే డైలాగు ఆకట్టుకుంటోంది. వేలంటైన్స్‌ డే సందర్భంగా విడుదలైంది ‘మజిలీ’ టీజర్‌. నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో నాగచైతన్య రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారు. అందులో ఒకటి క్రికెటర్‌ గెటప్‌ కాగా, మరొకటి మధ్య వయస్కుడి గెటప్‌. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దివ్యాంశ కౌశిక్‌ మరో నాయిక. ‘దేర్‌ ఈజ్‌ లవ్‌, దేర్‌ ఈజ్‌ పెయిన్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. షైన్‌ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతోంది. నిర్మాతలు సాహు గారపాటి, హరీష్‌ పెద్ది మాట్లాడుతూ ”’ఒక్కసారి పోతే మళ్లీ తిరిగిరాదు… అది వస్తువు అయినా, మనిషి అయినా!… వెధవలకి ఎప్పుడూ మంచి పెళ్లాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్‌ చేశావ్‌…’వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ చూసిన వారందరూ మెచ్చుకుంటున్నారు” అని అన్నారు.

Spread the love