Home / Gallery / Actors / మహర్షి డిజిటల్ రైట్స్ ఎంతో తెలిస్తే షాక్ !

మహర్షి డిజిటల్ రైట్స్ ఎంతో తెలిస్తే షాక్ !

మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. చోటి చోటి అనే పల్లవితో సాగే ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ హాట్ గా మారింది. సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో మహర్షి రికార్డు సృష్టించింది. భరత్ అనే నేను హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో సినిమాకు డిమాండ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ సంస్థ ఏకంగా రూ.11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మహేష్ బాబు సినిమాల్లో ఇదే హయ్యస్ట్ డిజిటల్ బిజినెస్ గా చెప్పుకోవచ్చు. మే 9 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Spread the love