Home / Movie News / సుందరం మాస్టర్ బయటపెట్టిన సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు

సుందరం మాస్టర్ బయటపెట్టిన సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు

ఓ షోలో భాగంగా ఆయన మాట్లాడుతూ..

1965లో కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన నీర్కుముళి చిత్రంతో తన ప్రస్థానం మొదలు పెట్టి ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా సుందరం మాస్టర్ ఎందరో స్టార్ హీరోలకు పని చేశారు. ఆయనే కాదు.. ఆయన కుమారులు ప్రభుదేవా, రాజు, ప్రసాద్‌లు సైతం ప్రముఖ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. ఆయన తన తొలి సినిమాకు రూ.40 రెమ్యునరేషన్ అందుకున్నారట. దాదాపు 1200 సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన సుందరం మాస్టర్.. ఇన్నేళ్లకు ఓ షాకింగ్ సీక్రెట్‌ని వెల్లడించారు.

ఓ షోలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అసలు డ్యాన్స్ రాదని వెల్లడించారు. ”నా ముగ్గురు పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించా. వారికి క్లాసికల్‌ తెలుసు. ఎందుకంటే నేను ఇండస్ట్రీని నమ్ముకున్నా. ఇక్కడ మీకో సీక్రెట్‌ చెప్పాలి. నాకు అస్సలు డ్యాన్స్‌ తెలియదు. ‘పారిస్‌ బై నైట్‌’, ‘లండన్‌ బై నైట్‌’ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది నాకు నేనుగా నేర్చుకున్నా. లోకమంతా నన్ను గొప్ప డ్యాన్స్‌ మాస్టర్‌ అనుకుంటోంది.

మరి నాకేమో సరిగా డ్యాన్స్‌ రాదని లోపల గిల్టీ ఫీలింగ్‌ ఉండేది. నాలాగా నా పిల్లలకు కాకూడదని వాళ్లకు క్లాసికల్‌ నేర్పించా” అని చెప్పుకొచ్చారు.

Spread the love

Leave a Reply