Home / Movie News / జయలలిత బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

జయలలిత బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

‘ది ఐరన్ లేడి’ అనే టైటిల్‌:

దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది. ఈ చిత్రానికి ‘ది ఐరన్ లేడి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. పేపర్ టేల్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రియదర్శిని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది.

జయలలిత వర్థంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో నుదుటన పెద్ద బొట్టు, చీరకట్టుతో అచ్చం జయలలితలా నిత్యామీనన్ ఆకట్టుకుంటోంది. ఈ బయోపిక్ కోసం చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు ఫస్ట్‌లుక్‌ను చూస్తేనే అర్థమవుతోంది. ఈ చిత్రంలో దర్శకుడు ఏ ఏ అంశాలను స్పృశించనున్నారో వేచి చూడాలి.

Spread the love

Leave a Reply