Home / Celebrity news / రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్?

రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్?

రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఈమూవీకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ను వచ్చే నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజమౌళి ప్లాన్స్ కు అలియా భట్ అడ్డు తగులుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ తో కలుపుకుని అలియా భట్ నాలుగు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. దీనితో ఆమె ఒక్కరోజు కూడ తీరిక లేకుండా తన డేట్స్ ను ఆగష్టు నెల వరకు అందరికీ సద్దుబాటు చేసినట్లు టాక్. వచ్చే నెల మే నెలలో రాజమౌళి కోరిన విధంగా తాను ‘ఆర్ ఆర్ ఆర్’ కు డేట్స్ సద్దుబాటు చేయలేనని తాను మళ్ళీ జూలై నుంచి మాత్రమే ‘ఆర్ ఆర్ ఆర్’ కు డేట్స్ సద్దుబాటు చేయగలనని రాజమౌళికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

దీనితో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి తన షూటింగ్ యాక్షన్ ప్లాన్ అంతా మార్చుకోబోతున్నట్లు సమాచారం. దీనికితోడు ఈమూవీలో జూనియర్ పక్కన నటించవలసిన డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం రాజమౌళికి మరొక తలనొప్పిగా మారి ఆమె పాత్ర కోసం మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది.

ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు అత్యంత కీలకమైన ఇద్దరు హీరోయిన్స్ ఇస్తున్న షాక్ కు ఇప్పుడు ఏమిటి పరిష్కారం అని రాజమౌళి తన టీమ్ తో ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ కథ విషయంలో ఎన్నో మార్పులు చేసిన రాజమౌళి ఇక రానున్న రోజులలో ఈమూవీ ప్రాజెక్ట్ కోసం ఇంకా ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

Spread the love