FilmNagarDiary http://filmnagardiary.com Find Latest FilmNagar Updates Mon, 15 Apr 2019 06:11:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=4.7.3 దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో… http://filmnagardiary.com/approximately-1400-dancers/ Mon, 15 Apr 2019 06:05:16 +0000 http://filmnagardiary.com/?p=3358 రాఘవ లారెన్స్‌ హీరోగా , స్వీయ దర్శకత్వంలో ముని సిరీస్‌ నుంచి వస్తున్న హారర్‌ కామెడీ చిత్రం కాంచన 3.ఈచిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు.రాఘవేంద్ర ప్రొడోన్స్‌ బ్యానర్‌లో రాఘవ లారెన్స్‌ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఏప్రిల్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో రూ.కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టి భారీ స్థాయిలో పాటను చిత్రీకరించారు. బి.మధు మాట్లాడుతూ, …

The post దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో… appeared first on FilmNagarDiary.

]]>
కాంచన 3

రాఘవ లారెన్స్‌ హీరోగా , స్వీయ దర్శకత్వంలో ముని సిరీస్‌ నుంచి వస్తున్న హారర్‌ కామెడీ చిత్రం కాంచన 3.ఈచిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నారు.రాఘవేంద్ర ప్రొడోన్స్‌ బ్యానర్‌లో రాఘవ లారెన్స్‌ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఏప్రిల్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో రూ.కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టి భారీ స్థాయిలో పాటను చిత్రీకరించారు. బి.మధు మాట్లాడుతూ, కాంచన 3 చిత్రం ఏప్రిల్‌ 19న విడుదల చేస్తున్నామని తెలిపారు. హీరో అండ్‌ డైరెక్టర రాఘవ లారెన్స్‌ తన నట విశ్వరూపం చూపించారన్నారు. దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో మాస్టర్‌ అద్భుతంగా సాంగ్‌ షూట్‌ చేశారన్నారు.. 6రోజులపాటు సాంగ్‌ ను చిత్రీకరించినట్టు తెలిపారు. లారెన్స్‌కు ఈచిత్రం తన కెరీర్‌కే ప్రత్యేకమైందన్నారు.మాస్‌ కమర్షియల్‌ చిత్రాలు తీయటంలో సిద్ధహస్తుడు మన లారెన్స్‌ మరోసారి తనేంటో ప్రూవ్‌ చేసుకున్నారన్నారు. తప్పకుండా అన్ని వర్గాలకు ఈసినిమా నచ్చేలా ఉంటుందనే నమ్మకంతో ఉన్నామన్నారు.

The post దాదాపు 1400 మంది డ్యాన్సర్లతో… appeared first on FilmNagarDiary.

]]>
రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్? http://filmnagardiary.com/injured-is-ram-charan-r-r-r-shooting-is-brake/ Wed, 10 Apr 2019 05:19:55 +0000 http://filmnagardiary.com/?p=3348 రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఈమూవీకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ను వచ్చే నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజమౌళి ప్లాన్స్ కు అలియా భట్ అడ్డు తగులుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ తో కలుపుకుని అలియా భట్ నాలుగు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. దీనితో ఆమె ఒక్కరోజు కూడ తీరిక లేకుండా తన డేట్స్ ను ఆగష్టు నెల …

The post రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్? appeared first on FilmNagarDiary.

]]>

రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఈమూవీకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ను వచ్చే నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజమౌళి ప్లాన్స్ కు అలియా భట్ అడ్డు తగులుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ తో కలుపుకుని అలియా భట్ నాలుగు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. దీనితో ఆమె ఒక్కరోజు కూడ తీరిక లేకుండా తన డేట్స్ ను ఆగష్టు నెల వరకు అందరికీ సద్దుబాటు చేసినట్లు టాక్. వచ్చే నెల మే నెలలో రాజమౌళి కోరిన విధంగా తాను ‘ఆర్ ఆర్ ఆర్’ కు డేట్స్ సద్దుబాటు చేయలేనని తాను మళ్ళీ జూలై నుంచి మాత్రమే ‘ఆర్ ఆర్ ఆర్’ కు డేట్స్ సద్దుబాటు చేయగలనని రాజమౌళికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

దీనితో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి తన షూటింగ్ యాక్షన్ ప్లాన్ అంతా మార్చుకోబోతున్నట్లు సమాచారం. దీనికితోడు ఈమూవీలో జూనియర్ పక్కన నటించవలసిన డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం రాజమౌళికి మరొక తలనొప్పిగా మారి ఆమె పాత్ర కోసం మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది.

ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు అత్యంత కీలకమైన ఇద్దరు హీరోయిన్స్ ఇస్తున్న షాక్ కు ఇప్పుడు ఏమిటి పరిష్కారం అని రాజమౌళి తన టీమ్ తో ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ కథ విషయంలో ఎన్నో మార్పులు చేసిన రాజమౌళి ఇక రానున్న రోజులలో ఈమూవీ ప్రాజెక్ట్ కోసం ఇంకా ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

The post రామ్ చరణ్ గాయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్? appeared first on FilmNagarDiary.

]]>
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌? http://filmnagardiary.com/super-star-rajinikanth-167th-movie/ Tue, 09 Apr 2019 07:08:59 +0000 http://filmnagardiary.com/?p=3343 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌ ప్రారంభించింది. ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ముంబైలో భారీ సెట్‌ వేశారు. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ రివీల్‌ చేశారు. ఈ చిత్రానికి దర్బార్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌లోనే రజనీని పవర్‌ఫుల్‌గా చూపించారు. రజని వెనుక తుపాకులు, బెల్ట్‌, బేడీలు కనిపిస్తున్నాయి. రెండు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని మురుగదాస్‌ సంకల్పించారు. కథానాయికగా నయనతార నటిస్తుండగా, అనిరుధ్‌ …

The post సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌? appeared first on FilmNagarDiary.

]]>

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌ ప్రారంభించింది. ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ముంబైలో భారీ సెట్‌ వేశారు. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ రివీల్‌ చేశారు. ఈ చిత్రానికి దర్బార్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌లోనే రజనీని పవర్‌ఫుల్‌గా చూపించారు. రజని వెనుక తుపాకులు, బెల్ట్‌, బేడీలు కనిపిస్తున్నాయి. రెండు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని మురుగదాస్‌ సంకల్పించారు. కథానాయికగా నయనతార నటిస్తుండగా, అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ముంబై నేపథ్యంలో సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌లో తెలిసిపోతుంది.

The post సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 167వ చిత్రం నేటి నుంచి షూటింగ్‌? appeared first on FilmNagarDiary.

]]>
‘సాహు’ లో ప్రభాస్ వాడిన బైక్ గురించి ఒక ఆశక్తికర కథనం! http://filmnagardiary.com/prabhas-bike-in-sahu-is-an-interesting-story/ Thu, 04 Apr 2019 09:04:09 +0000 http://filmnagardiary.com/?p=3338 నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి ‘సాహో’ కోసం విపరీతంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈమూవీలోని యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ సినిమాల స్థాయిలో చూపించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో కేవలం ఈమూవీలోని యాక్షన్ సీన్స్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈమూవీలో ప్రభాస్ చేసే యాక్షన్ సీన్స్ కోసం ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ అనే బైక్ను ఉపయోగించారు. దుబాయ్లో గతేడాది చిత్రీకరించిన …

The post ‘సాహు’ లో ప్రభాస్ వాడిన బైక్ గురించి ఒక ఆశక్తికర కథనం! appeared first on FilmNagarDiary.

]]>

నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి ‘సాహో’ కోసం విపరీతంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈమూవీలోని యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ సినిమాల స్థాయిలో చూపించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో కేవలం ఈమూవీలోని యాక్షన్ సీన్స్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ముఖ్యంగా ఈమూవీలో ప్రభాస్ చేసే యాక్షన్ సీన్స్ కోసం ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ అనే బైక్ను ఉపయోగించారు. దుబాయ్లో గతేడాది చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ బైక్ గురించి ఒక ఆశక్తికర కథనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

హాలీవుడ్ సినిమాలలో ఛేజింగ్ సీక్వెన్స్ లో విపరీతంగా వాడే బైక్ ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్. తాజాగా అనేక సాంకేతిక మార్పులతో ఈ బైక్ను మార్కెట్ లోకి తెచ్చారు. 765 సీసీ లైన్ త్రీ సిలెండర్ ఇంజిన్ ద్వారా ఈ బైక్కు పవర్ సప్లై అవుతుంది. 121 బీహెచ్పీతో 11700 ఆర్పీఎం, 77ఎన్ఎం పీక్ టార్క్తో పాటు 10800 ఆర్పీఎం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఈ బైక్ ప్రత్యేకతలు అందరికీ తెలియడంతో ఈ బైక్ ఖరీదు గురించి ప్రభాస్ అభిమానులు గూగుల్ సర్చ్ లో తెగ వెతకడంతో ఈ బైక్ కు సంబంధించిన ధర కూడా బయటకు వచ్చింది.

ప్రభాస్ వాడిన ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్ ధర సుమారు 10.55 లక్షలు ఉంటుంది అని వస్తున్న వార్తలు ప్రభాస్ అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారింది. సాధారణంగా ఇలాంటి ఖరీదైన బైక్ లను బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ కూడ అలాంటి ఖరీదైన బైక్ ను వాడటంతో ప్రభాస్ ‘సాహు’ లో వాడిన బైక్ ఫోటోలు దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు అభిమానుల మధ్య ట్రెండింగ్ న్యూస్ గా మారింది..

The post ‘సాహు’ లో ప్రభాస్ వాడిన బైక్ గురించి ఒక ఆశక్తికర కథనం! appeared first on FilmNagarDiary.

]]>
చిరంజీవి ఎన్నికల ప్రచారంలో… http://filmnagardiary.com/chiranjeevi-in-election-campaign/ Wed, 03 Apr 2019 09:51:36 +0000 http://filmnagardiary.com/?p=3332 మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారా? అంటే అవుననే నేటీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరుపున చిరు ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. 8న వికారాబాద్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ ఉంది. దీనికి సోనియాగాంధీ హాజరుకానున్నారు. కేంద్ర మాజీ మంత్రి అయిన చిరంజీవి కూడా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇటీవలే చిరంజీవిని కొండా విశ్వేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఇతర …

The post చిరంజీవి ఎన్నికల ప్రచారంలో… appeared first on FilmNagarDiary.

]]>

మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారా? అంటే అవుననే నేటీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరుపున చిరు ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. 8న వికారాబాద్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ ఉంది. దీనికి సోనియాగాంధీ హాజరుకానున్నారు. కేంద్ర మాజీ మంత్రి అయిన చిరంజీవి కూడా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇటీవలే చిరంజీవిని కొండా విశ్వేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఇతర అంశాలపై చర్చించారు.

The post చిరంజీవి ఎన్నికల ప్రచారంలో… appeared first on FilmNagarDiary.

]]>
కాలినడకన తిరుమల చేరుకున్న సమంత నాగచైతన్య http://filmnagardiary.com/samantha-nagachaitanya-who-reached-thirumala-on-foot/ Tue, 02 Apr 2019 07:09:49 +0000 http://filmnagardiary.com/?p=3324 తిరుపతి: తిరుమల శ్రీవారిని సినీ నటులు నాగచైతన్య, సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ‘మజలీ’ సినిమా శుక్రవారం విడుదల కాబోతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. వీరితో పాటు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు అలిపిరి నుంచి కాలినడకన సమంత తిరుమలకు చేరుకున్నారు. రెండు …

The post కాలినడకన తిరుమల చేరుకున్న సమంత నాగచైతన్య appeared first on FilmNagarDiary.

]]>

తిరుపతి: తిరుమల శ్రీవారిని సినీ నటులు నాగచైతన్య, సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ‘మజలీ’ సినిమా శుక్రవారం విడుదల కాబోతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. వీరితో పాటు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు అలిపిరి నుంచి కాలినడకన సమంత తిరుమలకు చేరుకున్నారు. రెండు గంటల్లోనే మెట్లు ఎక్కి ఆశ్చర్య పరిచారు.

The post కాలినడకన తిరుమల చేరుకున్న సమంత నాగచైతన్య appeared first on FilmNagarDiary.

]]>
సమంత తో ప్రభాస్ జోడి..? http://filmnagardiary.com/prabhas-jodi-with-samantha/ Tue, 02 Apr 2019 06:15:52 +0000 http://filmnagardiary.com/?p=3318 బాహుబలి సినిమా విజయం తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. యాక్షన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కబోతున్న ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చాలా యాక్షన్ పార్ట్ పూర్తయిన నేపథ్యంలో షూటింగ్ తుది దశకు చేరుకున్న క్రమంలో ప్రభాస్ తన తర్వాత సినిమా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది కాకుండా నిర్మాత దిల్ రాజుతో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిలింనగర్ …

The post సమంత తో ప్రభాస్ జోడి..? appeared first on FilmNagarDiary.

]]>

బాహుబలి సినిమా విజయం తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. యాక్షన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కబోతున్న ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చాలా యాక్షన్ పార్ట్ పూర్తయిన నేపథ్యంలో షూటింగ్ తుది దశకు చేరుకున్న క్రమంలో ప్రభాస్ తన తర్వాత సినిమా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారు.

ఇది కాకుండా నిర్మాత దిల్ రాజుతో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిలింనగర్ టాక్.దిల్‌రాజు-ప్రభాస్ కాంబోలో రానున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇప్పటికే దిల్‌రాజు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి ప్రకటన మాత్రం బయటికి రాలేదు.

ఇప్పటివరకు సిల్వర్‌స్క్రీన్‌పై ప్రభాస్, సమంత కలిసి నటించలేదు. మరి దిల్‌రాజు ప్రాజెక్టు ఓకే అయితే..ఈ ఆసక్తికర కాంబినేషన్‌ త్వరలో వెండితెరపై సందడి చేయనుందన్నమాట. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ‘బాహుబలి’ విజయంతో ప్రపంచ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ‘సాహో’ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

The post సమంత తో ప్రభాస్ జోడి..? appeared first on FilmNagarDiary.

]]>
‘పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ’ http://filmnagardiary.com/pv-narasimha-rao-change-with-continuity/ Mon, 01 Apr 2019 10:50:04 +0000 http://filmnagardiary.com/?p=3310 తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర లాంటి బయోపిక్ చిత్రాలు వచ్చాయి. బాలీవుడ్ లో సైతం పలు బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. తాజాగా భారత దేశంలో అపర చాణిక్యుడుగా పేరుబడ్డ పి.వి. నరసింహారావు గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలోని ఎన్నో భాషలు అనయన అనర్గలంగా మాట్లాడగలరు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో మంత్రిగా, ముఖ్య మంత్రిగా బిసిలకు విద్య, ఉద్యోగరంగంలో రిజర్వేషన్‌లు కల్పించారు. తాజాగా ఆయన జీవిత కథ …

The post ‘పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ’ appeared first on FilmNagarDiary.

]]>

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర లాంటి బయోపిక్ చిత్రాలు వచ్చాయి. బాలీవుడ్ లో సైతం పలు బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. తాజాగా భారత దేశంలో అపర చాణిక్యుడుగా పేరుబడ్డ పి.వి. నరసింహారావు గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలోని ఎన్నో భాషలు అనయన అనర్గలంగా మాట్లాడగలరు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో మంత్రిగా, ముఖ్య మంత్రిగా బిసిలకు విద్య, ఉద్యోగరంగంలో రిజర్వేషన్‌లు కల్పించారు.

తాజాగా ఆయన జీవిత కథ ఆధారంగా ‘పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో నరసింహారావుతో కలిసి పనిచేసిన మంత్రులు, ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు చెప్పిన సమాచారాన్ని చూపించారు.

పి.వి.నరసింహారావు విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. అంతే కాదు తన జీవితంలోకి రాజకీయాలలోని అనేక పార్శ్వాలను ‘ఇన్‌సైడర్’ (లోపలి మనిషి) పేరుతో ప్రచురించారు. 1991లో ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని వర్ణించారు. జూన్‌లో ఈ పూర్తి డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారు.

The post ‘పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ’ appeared first on FilmNagarDiary.

]]>
మహర్షి డిజిటల్ రైట్స్ ఎంతో తెలిస్తే షాక్ ! http://filmnagardiary.com/maharshi-digital-rights/ Mon, 01 Apr 2019 05:42:08 +0000 http://filmnagardiary.com/?p=3309 మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. చోటి చోటి అనే పల్లవితో సాగే ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ హాట్ గా మారింది. సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో మహర్షి రికార్డు సృష్టించింది. భరత్ అనే నేను హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో సినిమాకు డిమాండ్ …

The post మహర్షి డిజిటల్ రైట్స్ ఎంతో తెలిస్తే షాక్ ! appeared first on FilmNagarDiary.

]]>

మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. చోటి చోటి అనే పల్లవితో సాగే ఈ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ హాట్ గా మారింది. సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో మహర్షి రికార్డు సృష్టించింది. భరత్ అనే నేను హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో సినిమాకు డిమాండ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ సంస్థ ఏకంగా రూ.11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మహేష్ బాబు సినిమాల్లో ఇదే హయ్యస్ట్ డిజిటల్ బిజినెస్ గా చెప్పుకోవచ్చు. మే 9 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

The post మహర్షి డిజిటల్ రైట్స్ ఎంతో తెలిస్తే షాక్ ! appeared first on FilmNagarDiary.

]]>
‘ఆమె మొగుడితో’ నాకేంటి ఎఫైర్..? http://filmnagardiary.com/affair-with-her-husband/ Thu, 28 Mar 2019 12:35:33 +0000 http://filmnagardiary.com/?p=3304 ఫిదా ఫేమ్ సాయిపల్లవి గురించి మరో హాట్ న్యూస్..! ఈ అమ్మడు ఒక దర్శకుడికి ఫిదా అయిందని కొన్నాళ్లుగా కోలీవుడ్ కోడై కూస్తోంది. ఆ కూత సాయిపల్లవి చెవిలోనూ పడింది. దాంతో ఈ భామ రుసరుసలాడుతోంది. “ఆ దర్శకుడు మంచి మిత్రుడు, అంతకుమించి ఏమీ లేదు” అంటోంది. ఫిదా, ఎంసీయే సినిమాలతో తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి.. తమిళ దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్‌తో ప్రేమలో పడిందని, ఆయన్ని పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఏ.ఎల్‌. …

The post ‘ఆమె మొగుడితో’ నాకేంటి ఎఫైర్..? appeared first on FilmNagarDiary.

]]>

ఫిదా ఫేమ్ సాయిపల్లవి గురించి మరో హాట్ న్యూస్..! ఈ అమ్మడు ఒక దర్శకుడికి ఫిదా అయిందని కొన్నాళ్లుగా కోలీవుడ్ కోడై కూస్తోంది. ఆ కూత సాయిపల్లవి చెవిలోనూ పడింది. దాంతో ఈ భామ రుసరుసలాడుతోంది. “ఆ దర్శకుడు మంచి మిత్రుడు, అంతకుమించి ఏమీ లేదు” అంటోంది.

ఫిదా, ఎంసీయే సినిమాలతో తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి.. తమిళ దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్‌తో ప్రేమలో పడిందని, ఆయన్ని పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఏ.ఎల్‌. విజయ్ గతంలో హీరోయిన్ అమలాపాల్‌ని పెళ్లాడి, డివోర్స్ తీసుకున్నాడు. ‘కణం’ సినిమాలో సాయి పల్లవిని డైరెక్ట్ చేశాడు విజయ్. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందనేది టాక్‌.

ఐతే.. సాయి పల్లవి మాత్రం ఇదంతా ట్రాష్ అంటోంది. పెళ్లి చేసుకోబోనని ఆ మధ్య ప్రకటించింది ఈ డాక్టర్ పిల్ల. ‘అదే మాట మీద ఉన్నాను ఇప్పటికీ’ అని మళ్ళీ చెబుతోంది. కానీ.. సినిమా ఇండస్ట్రీలో దేన్నీ తోసిపుచ్చలేం. ఎపుడైనా, ఏదైనా జరగొచ్చు. ఇలా చెప్పిన చాలామంది హీరోయిన్లు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న సందర్భాలున్నాయి. ఇక్కడే మరో మాట.. ఈ బాన్సువాడ భానుమతికీ ఏపీలో ఒక మంత్రిగారి కొడుక్కీ మధ్య ప్రేమాయణం నడిచిందన్న పుకారు కూడా గతంలో వినిపించింది.

The post ‘ఆమె మొగుడితో’ నాకేంటి ఎఫైర్..? appeared first on FilmNagarDiary.

]]>