Home / biggboss 3 / మళ్లీ ఆయనే హోస్ట్ గా ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు

మళ్లీ ఆయనే హోస్ట్ గా ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు

మూడవ సీజన్ కు హోస్ట్ ఎవరనే చర్చ :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై  బిగ్ బాస్ తో ఏ స్థాయిలో దుమ్ము రేపాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ను పరిచయం చేసిన ఎన్టీఆర్ కొన్ని కారణాల వల్ల రెండవ సీజన్ కు దూరం అయ్యాడు. రెండవ సీజన్ ను తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు నానితో కానిచ్చేశారు.

రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించడంను ప్రేక్షకులు పెద్దగా అంగీకరించినట్లుగా అనిపించలేదు. ఎన్టీఆర్ స్థాయిలో నాని మెప్పించలేక పోయాడనేది అందరు ఒప్పుకునే నిజం. ఇప్పుడు మూడవ సీజన్ కు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. మూడవ సీజన్ కు హోస్ట్ ఎవరనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.

బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం మూడవ సీజన్ కు మళ్లీ ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్న విషయం తెల్సిందే.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ ఎక్కువగా హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరిగే అవకాశం ఉంది. అందుకే ఎన్టీఆర్ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఇబ్బంది ఉండదనేది దాంతో తప్పకుండా ఎన్టీఆర్ మూడవ సీజన్ కు ఒప్పుకుంటాడని బిగ్ బాస్ నిర్వాహకులు చాలా నమ్మకంతో ఉన్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ విడుదల అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో ప్రేక్షకులకు చేరువగా ఉండేందుకు ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 3 కి ఓకే చెప్తాడంటూ నిర్వాహకులు చాలా గట్టి నమ్మకంతో ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదట. మల్టీస్టారర్ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.

ఆ ుక్ రివీల్ కాకుండా ఉండాలని జక్కన్న భావిస్తాడు. అలాంటప్పుడు ఎన్టీఆర్ ను బిగ్ బాస్ 3 కి రాజమౌళి పంపిస్తాడా అనేది అనుమానమే. రాజమౌళి సినిమా చేసే సమయంలో హీరో మరే ప్రాజెక్ట్ లకు కమిట్ అవ్వరు. అలాగే ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ కు ఓకే చెప్పడం అనుమానమే. ఎంతగా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నించినా కూడా ఎన్టీఆర్ ఒప్పుకోక పోవచ్చు.

Spread the love