Home / Gallery / Actors / చిరంజీవి ఎన్నికల ప్రచారంలో…

చిరంజీవి ఎన్నికల ప్రచారంలో…

మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారా? అంటే అవుననే నేటీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరుపున చిరు ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. 8న వికారాబాద్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ ఉంది. దీనికి సోనియాగాంధీ హాజరుకానున్నారు. కేంద్ర మాజీ మంత్రి అయిన చిరంజీవి కూడా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇటీవలే చిరంజీవిని కొండా విశ్వేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఇతర అంశాలపై చర్చించారు.

Spread the love