Home / Movie News / చిట్టికి డేంజర్ బెల్!

చిట్టికి డేంజర్ బెల్!

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో రూపొందిన విజువల్ వండర్ 2.0:

దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో రూపొందిన విజువల్ వండర్ 2.0 వీకెండ్ ని బాగానే వాడుకుంటునప్పటికీ ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లు నమోదు కాకపోవడం బయ్యర్లను కొంత ఖంగారు పెడుతోంది. చాలా కీలకంగా భావించిన నాలుగు రోజుల వారాంతాన్ని చిట్టి పూర్తిగా సద్వినియోగపరుచుకోలేదనే ట్రేడ్ టాక్. ముఖ్యంగా దుమ్ముదులపాల్సిన సౌత్ లో కాస్త స్లోగా ఉండగా నార్త్ లోనే మంచి వసూళ్లు నమోదు కావడం విశేషం. తెలుగు వెర్షన్ వరకు జోరు బాగానే ఉన్నా తమిళ్ నుంచి మాత్రం జోష్ తగ్గినట్టుగా సమాచారం.

మొత్తం మూడు రోజులకు 91 కోట్ల షేర్ ని అన్ని భాషలకు రాబట్టుకున్న 2.0 ఒక్క శనివారమే సుమారు 29.5 కోట్లు రాబట్టింది. నిన్న లెక్కలు ఇంకా అందాల్సి ఉన్నందున అవి జోడిస్తే ఇంకా బెటర్ ఫిగర్స్ కనిపించవచ్చు. ఇక గ్రాస్ లెక్కలకు వస్తే శనివారం ఒక్క రోజు ఇండియా వైడ్ 59 కోట్లు రాబట్టింది. అప్పటిదాకా వచ్చిన మొత్తాన్ని లెక్క వేసుకుంటే 173 కోట్ల దాకా తేలుతుంది. ఇందులో అధిక షేర్ నార్త్ స్టేట్స్ నుంచే రావడం విశేషం. సుమారు 30 కోట్ల గ్రాస్ శనివారం ఉత్తరాది రాష్ట్రాల నుంచే వచ్చింది.

విచిత్రంగా తమిళనాడులో మాత్రం 2.0 అద్భుతాలు చేయడం లేదు. మూడు రోజుల్లో కేవలం 34 కోట్లకు మాత్రమే రాబట్టిన 2.0 సర్కార్ మొదటిరోజు కలెక్షన్ కంటే కేవలం రెండు కోట్లే ఎక్కువ రాబట్టడం పరిస్థితిని సూచిస్తోంది. ఒక్క తమిళనాడు నుంచే 2.0 వంద కోట్ల దాకా షేర్ ఇవ్వాల్సిన టార్గెట్ ఉంది. ఒకవేళ ఆదివారం లెక్కలు జోడించినా  సగం కూడా టచ్ చేసే ఛాన్స్ లేదని అంటున్నారు. అయినా పోటీ ఏది లేదు కాబట్టి ఇంకో వీకెండ్ చేతిలో ఉంది కనక సేఫ్ గా బయట పడేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love

Leave a Reply