Home / Movie Gossips / ఇదంతా బయోపిక్ ఎఫెక్టేనా

ఇదంతా బయోపిక్ ఎఫెక్టేనా

118 ప్రీ రిలీజ్ ఫంక్షన్

నిన్న జరిగిన 118 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదో అభిమానుల అల్లరి సందడితో బాగానే జరిగినట్టు అనిపించినా నందమూరి హీరోల మొహాలు మాత్రం డల్ గా ఉండటం మీడియా దృష్టి దాటి పోలేదు. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో బాలయ్య చాలా హుషారుగా కనిపిస్తారు. మాట్లాడింది తప్పో ఒప్పో చివరి దాకా జోష్ లో ఉండటం ఆయనకు అలవాటు. స్టేజి పైకి వెళ్ళడానికి ముందు కింద కూర్చుకున్నప్పుడు కూడా తన పక్కన ఎవరున్నా సరదాగా కబుర్లతో గడిపేస్తూ ఉంటారు. కానీ ఈ శైలికి భిన్నంగా బాలయ్య మొహంలో కళ లేకపోవడం కనిపించని వాస్తవమైతే కాదు.

మహానాయకుడు వచ్చి మూడు రోజులే అయ్యింది. దారుణమైన వసూళ్లతో నెగటివ్ షేర్స్ తో బాలకృష్ణ కెరీర్ మొత్తం మీద అతి పెద్ద డిజాస్టర్ గా మిగలబోతోంది. ఓ వారం పది రోజులు తర్వాత ఈ పరిస్థితి ఉంటే అందులో ఫీలవ్వడానికి ఏమి లేదు. కానీ నిన్న ఇంకా నాలుగో రోజే. వీకెండ్ లో సైతం మహానాయకుడుకి సానుభూతి దక్కలేదు. హైదరాబాద్ లోని పలు థియేటర్లలో షోకు కలెక్షన్ పది వేలు దాటలేదు

ఇదంతా బాలయ్యను బాగా డిస్టర్బ్ చేసిందని సన్నిహితుల మాట. ఎంతో కష్టపడి నాలుగు నెలలు ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకుని ఎన్టీఆర్ బయోపిక్ లోకంగా గడిపిన బాలకృష్ణకు ఫలితం తాలూకు పరిణామాలు ఏ మాత్రం జీర్ణం కావడం లేదు. హిట్ అయ్యుంటే నిన్న వేదిక మీద మహానాయకుడు సక్సెస్ చేసినందుకు థాంక్స్ చెప్పేవాడు బాలయ్య. కానీ కనీసం ప్రస్తావన తెచ్చే అవకాశం కూడా రిజల్ట్ ఇవ్వలేదు.

దానికి తోడు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లు సైతం ఏమంత జోష్ లో కనిపించలేదు. బహుశా జరుగుతున్నది వాళ్లకూ తెలుసు కాబట్టి నవ్వుతూ తుళ్ళుతూ ఉంటె బాబాయ్ సినిమా పోయినా ఆ ఫీలింగ్ లేదనుకుంటారనే ఆలోచన కాబోలు అధిక శాతం సీరియస్ గానే కనిపించారు. ఆఫ్ కోర్స్ స్పీచులు కూడా అలాగే ఉన్నాయి లెండి

Spread the love