Home / Celebrity news / ‘ఆమె మొగుడితో’ నాకేంటి ఎఫైర్..?

‘ఆమె మొగుడితో’ నాకేంటి ఎఫైర్..?

ఫిదా ఫేమ్ సాయిపల్లవి గురించి మరో హాట్ న్యూస్..! ఈ అమ్మడు ఒక దర్శకుడికి ఫిదా అయిందని కొన్నాళ్లుగా కోలీవుడ్ కోడై కూస్తోంది. ఆ కూత సాయిపల్లవి చెవిలోనూ పడింది. దాంతో ఈ భామ రుసరుసలాడుతోంది. “ఆ దర్శకుడు మంచి మిత్రుడు, అంతకుమించి ఏమీ లేదు” అంటోంది.

ఫిదా, ఎంసీయే సినిమాలతో తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవి.. తమిళ దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్‌తో ప్రేమలో పడిందని, ఆయన్ని పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఏ.ఎల్‌. విజయ్ గతంలో హీరోయిన్ అమలాపాల్‌ని పెళ్లాడి, డివోర్స్ తీసుకున్నాడు. ‘కణం’ సినిమాలో సాయి పల్లవిని డైరెక్ట్ చేశాడు విజయ్. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందనేది టాక్‌.

ఐతే.. సాయి పల్లవి మాత్రం ఇదంతా ట్రాష్ అంటోంది. పెళ్లి చేసుకోబోనని ఆ మధ్య ప్రకటించింది ఈ డాక్టర్ పిల్ల. ‘అదే మాట మీద ఉన్నాను ఇప్పటికీ’ అని మళ్ళీ చెబుతోంది. కానీ.. సినిమా ఇండస్ట్రీలో దేన్నీ తోసిపుచ్చలేం. ఎపుడైనా, ఏదైనా జరగొచ్చు. ఇలా చెప్పిన చాలామంది హీరోయిన్లు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న సందర్భాలున్నాయి. ఇక్కడే మరో మాట.. ఈ బాన్సువాడ భానుమతికీ ఏపీలో ఒక మంత్రిగారి కొడుక్కీ మధ్య ప్రేమాయణం నడిచిందన్న పుకారు కూడా గతంలో వినిపించింది.
Spread the love